PM Modi: వారిని కాపాడేందుకే.. బెంగాల్ ప్రభుత్వంపై మోడీ ఫైర్

by Prasad Jukanti |

బిహార్‌ ఎన్నికల ఫలితం బెంగాల్ ఎన్నికల్లో తమ విజయానికి బాటలు వేస్తుందన్న మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

PM Modi: వారిని కాపాడేందుకే.. బెంగాల్ ప్రభుత్వంపై మోడీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మమత బెనర్జీ (Mamata Banerjee) పాలనలో పశ్చిమబెంగాల్‍లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) విమర్శించారు. ఇటువంటి మహా జంగిల్ రాజ్ కు తగిన బుద్ధిచెప్పాలంటే బెంగాల్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉందన్నారు. ఇవాళ బెంగాల్ లోని తాహెర్ పుర్ ర్యాలీలో వర్చువల్ గా పాల్గొని మాట్లాడిన మోడీ.. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ బెంగాల్ లో చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపించారు. అందువల్లే రాష్ట్రంలో ఎస్ఐఆర్ ను (S.I.R) టీఎంసీ వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తృణమూల్ నేతలు నన్ను, బీజేపీని ఎంత వ్యతిరేకించినా బెంగాల్ అభివృద్ధిని మాత్రం తాము ఎన్నడూ ఆపబోమన్నారు. టీఎంసీ ప్రభుత్వంలో ఉద్రిక్తతలు, అల్లర్లు, బెదిరింపులతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలు బెంగాల్ లో బీజేపీ విజయానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story