- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబ్రీ మసీదు ప్రణాళిక నేపథ్యంలో TMC ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ సస్పెండ్.. కొత్త పార్టీ ప్రకటన
బాబ్రీ మసీదును పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో నిర్మిస్తామని టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: బాబ్రీ మసీదును పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో నిర్మిస్తామని టీఎంసీ ఎమ్మెల్యే (TMC MLA) చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు (Babri Masjid) ప్రతిరూపం యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటానని ప్రకటించిన తిరుగుబాటు టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ (Humayun Kabir)పై తృణమూల్ కాంగ్రెస్ (TMC) వేటు వేసింది. మత రాజకీయాలను తమ పార్టీ నమ్మదని పేర్కొంటూ టీఎంసీ ఆయనను సస్పెండ్ చేసింది. డిసెంబర్ 6న తాను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటానని ఈ ఎమ్మెల్యే గతంలో ప్రకటించారు.
అనంతరం పార్టీ అతనిపై సస్పెన్షన్‌పై హుమాయున్ కబీర్ తీవ్రంగా స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో "నేను డిసెంబర్ 6న శంకుస్థాపన చేస్తాను. ఇది నా వ్యక్తిగత విషయం, పార్టీకి దీంతో ఎలాంటి సంబంధం లేదు. 2015లో నన్ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ సస్పెండ్ చేశారు. దాని గురించి నాకు చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటాను," అని ఆయన స్పష్టం చేశారు. కొద్ది సేపటి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 22న తాను కొత్త పార్టీని ప్రకటిస్తానని సంచలన ప్రకటన చేశాడు. అలాగే తన కొత్త పార్టీ తరుఫున రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 135 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతానని ఆయన ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా, టీఎంసీకి (వారికి) వ్యతిరేకంగా తాను పోరాడతానని, వారు (టీఎంసీ) ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కబీర్ సవాల్ విసిరారు.






