- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
supreme court: పశువుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అనుబ్రతా మోండల్‌కు బెయిల్
దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత అనుబ్రతా మోండల్‌కు భారీ ఊరట లభించింది. పశువుల అక్రమ రవాణా కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బేల ఎం త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ, అనుబ్రత మోండల్‌ను దర్యాప్తుకు సహకరించాలని, విదేశాలకు తరలిపోకుండా ఉండటానికి పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా మోండల్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, మోండల్ దాదాపు రెండేళ్లపాటు జైలులో ఉన్నారని, మిగతా నిందితులందరూ బెయిల్‌పై బయట ఉన్నారని వాదించారు. ఈ కేసులో 309 మంది సాక్షులు ఉన్నారు, త్వరలో కేసు ముగిసే అవకాశం లేదని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేయాలని రోహత్గీ కోరగా, బెయిల్ మంజూరు చేసినట్లయితే సాక్ష్యాధారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు వాదించింది. ఈ క్రమంలో పూర్తి విచారణ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేసు విషయానికి వస్తే,
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్, ముర్షిదాబాద్ జిల్లాల ద్వారా బంగ్లాదేశ్‌కు అక్రమంగా పశువులను రవాణా చేయడానికి మోండల్ సహకరించారని, దీని కోసం ముడుపులు అందుకున్నారని CBI ఆరోపించింది. రూ.48.06 కోట్ల ఆస్తులతో పాటు , పశువుల అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న రూ. 29.5 కోట్ల విలువైన ఆస్తులను సీబీఐ గుర్తించింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈ కేసులో రూ. 77.56 కోట్ల ఆస్తులను గుర్తించింది. ఈ క్రమంలో ఆగస్టు 2022లో సీబీఐ, నవంబర్ 2022లో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మార్చి 21, 2023న తీహార్ జైలుకు పంపారు.