Time magazine 2025: టైమ్ ప్రభావశీలుర జాబితాలో భారతీయులకు దక్కని చోటు.. పరోక్షంగా ఊరట

by Prasad Jukanti |

అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితా 2025 ను మైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది.

Time magazine 2025: టైమ్ ప్రభావశీలుర జాబితాలో భారతీయులకు దక్కని చోటు.. పరోక్షంగా ఊరట
X

దిశ,డైనమిక్ బ్యూరో: ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్ (Time magazine) జాబితా 2025 విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల (Time 100 most influential people) 2025 ఎడిషన్‌ను టైమ్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మెక్సికన్ అధ్యక్ష అభ్యర్థి క్లాడియా షీన్‌బామ్, రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్, జేవియర్ మిలీ, టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, ఫ్రెడరిక్ మెర్జ్ తదితరులకు చోటు దక్కింది. అలాగే జిమ్మాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్ పేర్లు ఉన్నాయి.

భారతీయులకు దక్కని స్థానం:

ఈ టైమ్స్ మ్యాగజైన్ జాబితాను లీడర్స్‌, ఐకాన్స్‌, టైటాన్స్‌, ఆర్టిస్ట్స్‌, ఇన్నోవేటర్స్‌ ఇలా పలు కేటగిరీలుగా విభజించి విడుదల చేశారు. అయితే ఈసారి అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. గతేడాది భారత్ నుంచి నటి అలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్ స్థానం చోటు దక్కాయి. అంతకు ముందు 2023లో టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ రాజమౌళి, బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ వంటి వారు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇటీవల సంవత్సరాల్లో ఇలా టైమ్స్ మ్యాగజైన్ లో భారతీయుల (Inidans) పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి.

భారత సంతతి వ్యక్తికి చోటు:

ఈ జాబితాలో భారతీయులకు నేరుగా చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ పార్మానూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి (Reshma kewalramani) టైమ్ జాబితాలో నిలిచారు. రేష్మ ముంబయి లో జన్మించారు. ఆమెకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. ఫార్మా రంగంలో తన సత్తాచాటుతున్న రేష్మా అమెరికా అతిపెద్ద బయోటెక్నాలజీకి తొలి మహిళా సీఈవోగా అరుదైన ఘనత సాధించారు.

Next Story