అమర్‌నాథ్ యాత్రకు దగ్గరపడుతోన్న టైమ్.. సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-21 04:06:40  IST  )

ఖీర్ భవానీ మేళా (Kheer Bhavani Mela)తో పాటు అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు అన్ని ఏర్పాట్లు చేశామని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) తెలిపారు.

అమర్‌నాథ్ యాత్రకు దగ్గరపడుతోన్న టైమ్.. సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు సమయం దగ్గరపడుతోన్నవేళ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన తన నియోజకవర్గం గండర్‌బల్‌లో పర్యటించి పవిత్ర ఖీర్ భవానీ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పర్యాటక కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదట మాతా ఖీర్ భవానీ మేళాను విజయవంతంగా నిర్వహించడం, అనంతరం సోనమార్గ్, పహల్గాం మార్గాల నుంచి అమర్‌నాథ్ యాత్రను సజావుగా నిర్వహించడం తమ ముందు ఉన్న లక్ష్యాలని చెప్పుకొచ్చారు. పర్యాటక రంగం పునరుద్ధరణకు జమ్మూకశ్మీర్ సర్కార్ కృషి చేస్తుందని, పర్యాటకుల భద్రతే తమ కర్తవ్యమని సీఎం ఒమర్ అబ్దుల్లా కామెంట్ చేశారు. అయితే, అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కాబోతుంది.

Next Story