- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం.. ముహూర్తం ఖరారు
ఉప రాష్ట్రపతి(Vice President Of india) ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి(Vice President Of india) ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా నూతన ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తేదీ ఖరారైంది. ఈనెల 12న ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 17వ భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం చేయనున్నారు. కాగా, జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి(B.Sudershan Reddy) బరిలో నిలిచారు. మొత్తం 767 ఓట్లు పోలవ్వగా.. రాధాకృష్ణన్‌కు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. మిగతా 15 ఓట్లు చెల్లుబాటుకాలేదు. అలాగే, ఓ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయగా.. దానిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనమైంది.






