TikTok star: పాకిస్తాన్‌లో టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య

by B.Srinivas |

పాకిస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ సనా యూసఫ్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె నివాసంలోనే దుండగులు కాల్చి చంపారు.

TikTok star: పాకిస్తాన్‌లో టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ సనా యూసఫ్ (Sana Yousuf) దారుణ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్‌లోని ఆమె నివాసంలోనే దుండగులు కాల్చి చంపారు. సోమవారం అర్ధరాత్రి సనా ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడని స్థానిక కథనాలు వెల్లడించాయి. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సనా మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడిని 22 ఏళ్ల బాలుడిగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి సనాకు దూరపు బంధువు అని పలుమార్లు ఆమెకు లవ్ ప్రపోజ్ చేయగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే నిందితుడిని ఇంకా పట్టుకోలేదని తెలిసింది. ఈ హత్య అనంతరం సనాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టుకు వెల్లువెత్తాయి. ఆమెను న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు.

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్‌కు చెందిన సనా తన టిక్‌టాక్ వీడియోలకు భారీగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలోనూ క్వెట్టాలో హీరా అనే 15 ఏళ్ల బాలికను ఆమె తండ్రి, మామ కలిసి హత్య చేశారు. టిక్ టాక్ వీడియోలు చేస్తుందనే కారణంతో ఆమెను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. టిక్ టాక్ ఆపాలని చెప్పినప్పటికీ హీరా వినకపోవడంతో ప్లాన్ ప్రకారం చంపేసినట్టు తెలిపారు.

Next Story