- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు వ్యవసాయ కూలీలను పొట్టన పెట్టుకున్న బెబ్బులి పట్టివేత
అక్టోబరు 18న బావూజి పాల్, 26న అల్కా పెందోన్‌లపై పెద్దపులి దాడి చేసి పొట్టన పెట్టుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని దాబా అటవీ క్షేత్రంలో పెద్దపులి బీభత్సం సృష్టించింది. అక్టోబరు 18న బావూజి పాల్, 26న అల్కా పెందోన్‌లపై పెద్దపులి దాడి చేసి పొట్టన పెట్టుకుంది. గోండ్ పిపారీ ప్రాంతానికి చెందిన ఆ ఇద్దరూ వ్యవసాయ పనుల నిమిత్తం అడవికి సమీపంలో పనిచేస్తుండగా మాటు వేసిన పులి దాడి చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బాధితులకు న్యాయం చేయాలంటూ, పులిని వెంటనే పట్టుకోవాలంటూ స్థానికులు ప్రధాన రహదారిపై దాదాపు తొమ్మిది గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగడంతో ఆందోళనకు ముగింపు పలికారు.
పులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, బోన్లను సిద్ధం చేసింది. గాలింపు చర్యల్లో భాగంగా పొంబుర్న తాలూకా పరిధిలో బెబ్బులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం ప్రత్యేకంగా శిక్షణ పొందిన షూటర్‌తో పులిపై మత్తు ఇంజక్షన్ ప్రయోగించి అదుపులోకి తీసుకున్నారు. మత్తు ప్రభావంతో బోనులో బంధించిన బెబ్బులిని టైగర్ ట్రాన్సిట్ సెంటర్‌కు తరలించారు. ఇకపై గ్రామస్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.






