- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tiger Attack : మహారాష్ట్రలో టైగర్ టెర్రర్.. 4 రోజుల్లో ఆరుగురిని చంపి తిన్న పులి
మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రాపూర్(Chandrapur) ప్రస్తుతం టైగర్(Tiger) టెర్రర్ లో ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రాపూర్(Chandrapur) ప్రస్తుతం టైగర్(Tiger) టెర్రర్ లో ఉంది. కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఆరుగురిని పులి చంపి తినడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ముఖ్యంగా చిమూర్(Chimur) తాలూకాలోని కర్బాడ్(Karbhad Tiger Incident) గ్రామంలో తొలుత ఈ పులి దాడులు మొదలయ్యాయి. చిమూర్ తాలూకాలో నాలుగు రోజుల్లోనే ఆరుగురిపై.. అందులోనూ ఐదుగురు మహిళలు పులి చేతిలో ప్రాణాలు వదిలారు.
తాజాగా మంగళవారం భదుర్ని గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఆదివాసీ మహిళ భువనేశ్వరీ భేండ్రే తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్(Tadobha-Andhari Tiger Reserve) బఫర్ జోన్‌లో తెండు ఆకులు సేకరిస్తుండగా పులి దాడి చేసి, చంపి తినేసింది. స్థానికులు అటవీ శాఖ అధికారులపై నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పులుల కదలికలను నియంత్రించడంలో, తగిన నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అటవీ శాఖ భువనేశ్వరీ కుటుంబానికి నష్ట పరిహారం అందించినప్పటికీ.. స్థానికుల ఆగ్రహాన్ని అపలేకపోయాయి.
తక్షణమే అధికారులు పులిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గంటల తరబడి ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు కాలగజేసుకొని నచ్చజెప్పడంతో వారు శాంతించారు. అయితే అడవుల్లో వేసవి వేడి, నీటి కొరత వల్ల పులులు గ్రామాల సమీపంలోకి రావడం.. అదే సమయంలో ఆదివాసీలు అటవీ ఉత్పత్తుల కోసం అడవుల్లోకి వెళ్లడం వల్ల జరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. పులిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు, అప్పటిదాకా అటవీ పరిసర ప్రాంతాల్లోకి, గ్రామ శివార్లలో ఒంటరిగా సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.






