- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tiger With Wild Boar : ప్రాణం కోసం పులి..అడవి పంది ఒక్కటయ్యాయి
సహజ శత్రువులు..జాతి వైరాన్ని మరిచి ప్రాణం కోసం ఒక్కటైన అరుదైన ఘటన మధ్యప్రదేశ్ సియోని(Madhya Pradesh Seoni)కురై బ్లాక్‌లోని పిపారియా హర్దులి గ్రామంలో చోటుచేసుకుంది. ఆహారం కోసం అడవి పంది(Wild Boar)ని వేటాడేందుకు పెద్దపులి(Tiger) చేసిన వేట అంతటి కృూరమృగానికి కూడా ప్రాణాపాయంలో జాతి వైరాన్ని వదిలేసేలా చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : సహజ శత్రువులు..జాతి వైరాన్ని మరిచి ప్రాణం కోసం ఒక్కటైన అరుదైన ఘటన మధ్యప్రదేశ్ సియోని(Madhya Pradesh Seoni)కురై బ్లాక్‌లోని పిపారియా హర్దులి గ్రామంలో చోటుచేసుకుంది. ఆహారం కోసం అడవి పంది(Wild Boar)ని వేటాడేందుకు పెద్దపులి(Tiger) చేసిన వేట అంతటి కృూరమృగానికి కూడా ప్రాణాపాయంలో జాతి వైరాన్ని వదిలేసేలా చేసింది. పెంచ్ టైగర్ రిజర్వ్ (Pench Tiger Reserve ) లో అడవి పందిని వేటాడుతూ పులి దాని వెనుక పరుగెత్తగా ప్రాణాలు రక్షించుకునే పరుగులో ముందున్న బావిని చూసుకోలేక పంది అందులో పడిపోగా..దాని వెంటపడిన పులి సైతం అదే వేగంతో వచ్చి బావిలో పడిపోయింది.
బావిలో పడిన రెండు జంతువులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరస్పర వైరం మాని కలిసి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయడం ఆసక్తిగా మారింది. బావికి ఉన్న సిమెంట్ రింగ్స్ ఊచలను పట్టుకుని రెండు జంతువులు పక్కపక్కనే ఉండి ప్రాణాలు కాపాడుకునేందుకు తంటాలు పడ్డాయి. ప్రక్కనే ఆహారం పంది రూపంలో ఉన్నప్పటికి దాని కోసం చూస్తే నీటిలో మునిగి చస్తానని పులి ఒకవైపు..పులి రూపంలో ప్రాణాపాయం పొంచి ఉన్న ముందు బావి నీటిలో నుంచి బయటపడేందుకు ఆడవి పంది అనివార్యంగా ప్రాణరక్షణ కోసం ఉమ్మడి ప్రయత్నాలు సాగించిన వీడియో వైరల్ గా మారింది. ఆ సమయంలో పులి పందిని చంపడం కంటే తాను బతకడమే గొప్ప అనుకుని, పక్కనే అడవి పంది ఉన్నా ఏమీ చేయకుండా వదిలేసింది.
పొలంలో ఉన్న బావిలో పులి, అడవి పంది తేలుతూ ఉండటానికి చేస్తున్న అరుపులతో వాటిని తెల్లవారుజామున గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. పులి, అడవి పంది రెండు ఒకే చోట ఉండటంతో రెస్క్యూ చేయడం అధికారులకు కూడా సవాల్ గా మారింది..పెంచ్ టైగర్ రిజర్వ్ రెస్క్యూ బృందం చాకచక్యంగా రంగంలోకి దిగి, రెండు జంతువులను సురక్షితంగా బావిలో నుంచి పైకి తీసుకోచ్చారు.
సీనియర్ ఐఏఎస్ సుప్రియా సాహు ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది. జాతి వైరాన్ని మరిచి పులి..అడవి పంది చేసిన ప్రాణరక్షణ ప్రయత్నాలు ప్రకృతి నేర్పిన జీవిత పాఠాలని..పరస్పర శత్రువులైన రెండు జంతువులను కాపాడిన సిబ్బంది నిజమైన హీరోలు అని ఆమె అభినందించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలానికి నిలయం. 2021లో తీసిన లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 44 పులులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు.






