- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగుల వర్షం.. 13 మంది మృతి
by Yella Dhawani Reddy |
బీహార్ రాష్ట్రంలో (Bihar state) భీకరమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రంలో (Bihar state) భీకరమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పిడుగులు (Thunderbolts) పడి బెగుసరాయ్, దర్భంగా, మధుబని, సమస్తిపూర్‌లలో 13 మంది ప్రాణాలు (13 people dead) కోల్పోయారు. మధుబని జిల్లాలోని పిప్రౌలియా గ్రామంలో ముగ్గురు మృతి చెందగా, ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పిడుగుపాటు కారణంగా ఇంతమంది మరణించడం పట్ల సీఎం నీతీష్ కుమార్ దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
Next Story






