- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొగ్గుగని పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న మరికొంతమంది
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని బేతుల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గని పైకప్పు(Coal Mine Roof Collapse) కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని బేతుల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గని పైకప్పు(Coal Mine Roof Collapse) కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరికొంత మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులతో కలిసి అధికారులు స్పాట్‌కు వచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, ఇటీవల తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట మండలంలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగం(SLBC Tunnel)లోని 14వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలిన ఘటనలో 8 మంది సిబ్బంది చిక్కుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. నాలుగైదు రోజులు ప్రాణాలతో పోరాడి మృతిచెందారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మోడీ మోడీ, హోంమంత్రి అమిత్ షా సైతం స్పందించి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ఘటనను ఇంకా దేశ ప్రజలు మరువక ముందే మధ్య ప్రదేశ్‌లో మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. బేతుల్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






