Family died: ఫరీదాబాద్‌లో ఏసీ పేలి దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. పెంపుడు కుక్క సైతం..

by Ramesh Naini |

హర్యానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఏసీ పేలి ముగ్గురు మనుషులతో పాటు ఓ కుక్క కూడా చనిపోయింది.

Family died: ఫరీదాబాద్‌లో ఏసీ పేలి దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. పెంపుడు కుక్క సైతం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఏసీ పేలి (AC explosion) ముగ్గురు మనుషులతో పాటు ఓ కుక్క కూడా చనిపోయింది. ఫరీదాబాద్ (Faridabad) నగరంలోని గ్రీన్ ఫీల్డ్ కాలనీ ఆదివారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ ఘటన జరిగింది. రెండవ అంతస్తులో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన సచిన్ కపూర్ (49), ఆయన భార్య రింకూ కపూర్ (48), వారి కుమార్తె సుజాన్ కపూర్ (13) ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటనలో సచిన్ కపూర్ దంపతుల కుమారుడు ఆర్యన్ కపూర్ (24) మాత్రం కిటికీ నుంచి దూకి ప్రాణాలతో బయట పడ్డాడు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏసీ కంప్రెసర్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఫ్లోర్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. గది అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా లేచి భయంతో పరుగెత్తేందుకు ప్రయత్నించారు. కానీ వెళ్లే మార్గం తలుపులు లాక్ అయి ఉండటంతో శ్వాస ఆడక ముగ్గురు మృతిచెందారు. వారితో పాటు ఉన్న పెంపుడు కుక్క కూడా ప్రాణాలు ఊపిరాడక ప్రాణాలు విడిచింది.పేలుడు జరిగిన వెంటనే కాలనీలో ఉన్న స్థానికులు కొందరు బయటకు వచ్చారు. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మంటలు రావడం గమనించిన వారు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

తర్వాత బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ముగ్గురు మరణించారని వైద్యులు నిర్ధారించారు. ఏసీ కంప్రెసర్ టెక్నికల్ లోపం కారణంగా పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించారు. కుటుంబం మొత్తం చనిపోవడంతో స్థానికులు తీవ్ర విషాదంలో ఉన్నారు. సచిన్ కపూర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారని, ఆయన భార్య గృహిణి అని, అని కూతురు స్కూల్, కుమారుడు జాబ్ ప్రిపరేషన్‌లో ఉన్నట్లు స్థానికుల సమాచారం. ట్వీట్ లింక్..

Next Story