మరో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

by Malleboina Mahesh |   (  Updated:2025-09-24 04:53:03  IST  )

ర్ఖండ్‌లోని గుమ్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌ (encounter)లో ముగ్గురు మావోయిస్టులు మృతి (Three Maoists killed)చెందారు.

మరో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లోని గుమ్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌ (encounter)లో ముగ్గురు మావోయిస్టులు మృతి (Three Maoists killed) చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్లా జిల్లాలో మావోయిస్టుల కదలికలు పెరిగాయనే పక్కా సమాచారంతో కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా దళాల (security forces)కు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఇరు పక్షాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే, భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్ జాగ్వార్, గుమ్లా పోలీసులతో కూడిన భద్రతా దళాలు, జార్ఖండ్ జన‌ముక్తి పరిషత్ (JJMP) మావోయిస్టుల మధ్య ఈ కాల్పులు జరిగాయని, అదేవిధంగా ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌లో మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని IG జార్ఖండ్ పోలీసు ప్రతినిధి మైఖేల్ రాజ్ (Michael Raj) తెలిపారు. మరికొంతమంది మవోయిస్టుల కాల్పులు జరుపుతూ.. అడవిలోకి పారిపోగా వారి కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story