- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్‌లో జైషే ఉగ్రవాదులు.. నేపాల్ గుండా వచ్చిన ముగ్గురు టెర్రరిస్టులు?
బిహార్‌లోకి జైషే ఉగ్రవాదులు చొరబడినట్లు తెలుస్తోంది. మొత్తం ముగ్గురు టెర్రరిస్టులు నేపాల్ గుండా భారత్‌లో ప్రవేశించారని అధికారులు చెప్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోకి ముగ్గురు జైష్-ఎ-మహమ్మద్ టెర్రరిస్టులు ప్రవేశించడం కలకలం రేపింది. దీంతో రాష్ట్రమంతా హైఅలర్ట్‌లోకి వెళ్లింది. నేపాల్ నుంచి వీళ్లు ముగ్గురు భారత్‌లోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్‌లను, పాస్‌పోర్టు వివరాలను పోలీసులు విడుదల చేశారు. వీరిని పాక్‌లోని రావల్పిండికి చెందిన హస్నయిన్ అలీ, ఉమర్‌కోట్‌కు చెందిన అదిల్ హుస్సేన్, బహవల్పూర్‌కు చెందిన మహమ్మద్ ఉస్మాన్‌గా పోలీసులు గుర్తించారు.
వీరి గురించి సమాచారం అందించిన వారికి రూ.50 వేల నజరానా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా నేపాల్ బోర్డర్‌లో నిఘా పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ వంటి బడా నేతలు బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు రాష్ట్రంలో ప్రవేశించడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది.






