Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష..!

by Shamantha N |

ఇండోనేషియాలో (Indonesia) డ్రగ్స్‌ అక్రమ రవాణా (Drugs smuggling case) చేసిన ముగ్గురు భారతీయులకు మరణశిక్ష (Death penalty) పడనున్నట్లు వార్తలొస్తున్నాయి.

Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలో (Indonesia) డ్రగ్స్‌ అక్రమ రవాణా (Drugs smuggling case) చేసిన ముగ్గురు భారతీయులకు మరణశిక్ష (Death penalty) పడనున్నట్లు వార్తలొస్తున్నాయి. 2024 జులైలో సింగపూర్‌ జెండా ఉన్న షిప్ లో డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఇండోనేషియా పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 106 కేజీల క్రిస్టల్ మెత్‌ అనే డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు భారతీయులు రాజు ముత్తుకుమరన్ (38), సెల్వదురై దినకరన్ (34), గోవిందసామి విమల్కందన్ (45)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురూ తమిళనాడుకు చెందినవారు కావడం గమనార్హం. వారు ముగ్గురు లెజెండ్ అక్వేరియస్ కార్గో నౌకలో స్మగ్లింగ్ కు పాల్పడినట్లు ఆరోపించారు.

విచారణకు షిప్ కెప్టెన్ గైర్హాజరు

ఇకపోతే, మార్చి 14న ఈ కేసులో షిప్ కెప్టెన్‌ ను వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పమని కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, అతడు విచారణకు హాజరుకాలేదు. మరోవైపు, నిందితుల తరఫున భారతీయ న్యాయవాది జాన్ పాల్ కేసును వాదిస్తున్నారు. ఈయన కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం విశేషం. కెప్టెన్ సాక్ష్యం తమ క్లయింట్ల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి కీలకమని డిఫెన్స్ పట్టుబడుతోంది. కెప్టెన్‌కు తెలియకుండా ఓడలో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు తరలించడం సాధ్యం కాని విషయమని.. కుట్రపన్ని అమాయకులైన ముగ్గురు వ్యక్తులను ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. అసలైన నేరస్థులు తప్పించుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరినట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు, నిందితులకు ఇండోనేషియా చట్టం ప్రకారం గరిష్ట శిక్ష అయిన మరణశిక్షను ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడిన భారతీయులకు ఇండోనేషియా ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది.

Next Story