ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

by Naga Rani Yarlagadda |

బిహార్ లోని సమస్తిపుర్ జిల్లా లార్ఝఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలహా బుజుర్గ్ అనే గ్రామంలో విషాద ఘటన జరిగింది.

ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ లోని సమస్తిపుర్ జిల్లా లార్ఝఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలహా బుజుర్గ్ అనే గ్రామంలో విషాద ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లో విషవాయువును పీల్చి ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. వాటర్ లీకేజీని ఆపేందుకు ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు దిగారు. లోపలికి వెళ్లిన వారు ఒకరితర్వాత ఒకరు ఆ వాసన తట్టుకోలేక ఊపిరాడక స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

మృతులు రామ్ ఉమేష్ షా (48), దయా రామ్ షా (38), అతని కొడకు రాధేశ్యామ్ కుమార్ (15)గా గుర్తించారు. మొదట రామ్ ట్యాంక్ లోకి దిగగా.. చాలా సేపు బయటికి రాకపోవడంతో దయారామ్ వెళ్లారు. ఇద్దరూ రాకపోవడంతో రాధేశ్యామ్ కిందకు దిగాడు. ముగ్గురూ ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో జేసీబీ యంత్రాన్ని తెప్పించి ట్యాంక్ గోడను పగలగొట్టి జేసీబీతో బయటకు తీశారు. హసన్ పూర్ ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స తర్వాత.. మెరుగైన చికిత్స కోసం వారిని బెగుసరాయ్ కు తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Next Story