- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన బాలికపై అత్యాచారం.. బంగ్లాదేశ్ ఘర్షణల్లో ముగ్గురు మృతి
by Phanindra |
బంగ్లాదేశ్‌లో ఒక గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని కొండ ప్రాంతంలో గిరిజనులు, సెటిలర్లయిన బెంగాలీ కమ్యూనిటీ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ గొడవల్లో ముగ్గురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో 8వ గ్రేడ్ చదువుతున్న ఒక గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరగడంతో ఈ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు బలమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. అయినా సరే ఘర్షణలను వాళ్లు ఆపలేకపోయారు. ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఖగ్రాచ్చారీ ప్రాంతంలో ఇరువర్గాలు నిరసనలకు దిగి, ప్రత్యర్థి వ్యాపారాలు, ఇళ్లకు నిప్పు పెట్టే వరకు వెళ్లాయి.
Next Story






