- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
48 గంటల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి.. అప్రమత్తమైన అధికారులు
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు గంటల వ్యవధిలోనే మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు గంటల వ్యవధిలోనే మరణించారు. ఈ విషాదకర ఘటన ఉత్తప్రదేశ్ లోని నెబువా నౌరంగియా బ్లాక్ లోని గులార్హియా తోలా గ్రామంలో జరిగింది. చిన్నారులు తీవ్ర జ్వరంతో మరణించడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పింటు గౌర్ అనే వ్యక్తి కమార్తె మంజు (7) వారంరోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. స్థానిక వైద్యుడి వద్ద జ్వరానికి చికిత్స ఇప్పించగా కోలుకోకపోగా.. ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఇటీవల మరో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయింది.
మంజు మరణించిన గంటల వ్యవధిలోనే గౌర్ చిన్న కూతురు ఖుషి (3), కొడుకు కృష్ణ (5) కూడా జ్వరంతో బాధపడుతూ మరణించారు. ముగ్గురు చిన్నారుల మరణంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. చిన్నారుల మరణాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై స్థానికంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి.. గ్రామంలో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మలేరియా, డెంగీ పరీక్షలు చేసి అవసరమైన చిన్నారులకు మందులు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు చిన్నారుల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.






