- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రదాడులకు కుట్ర.. ముగ్గురు అరెస్ట్, ఇద్దరు అధికారులపై వేటు
by Naga Rani Yarlagadda |
దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు చేసిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు భగ్నం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు చేసిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు భగ్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వారు ఈ ఉగ్రదాడులకు వెపన్స్ అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ ఏటీఎస్ ఐదుగురు అల్-ఖైదా ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. వారిలో పాకిస్థాన్ లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఒక మహిళ కూడా ఉంది. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు పడింది. పాక్ ఉగ్రవాదులతోవారు సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో విధుల నుంచి తొలగించినట్లు పై అధికారులు వెల్లడించారు. SPOలు అయిన అబ్దుల్ లతీఫ్, మహ్మద్ అబ్బాస్ లపై కేసు నమోదు చేసి దోడా జైలుకు తరలించారు.
Next Story






