Ayodhya: అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తామంటూ మరోసారి బెదిరింపులు

by D.Reddy |   ( Updated:2025-04-15 11:49:54.0  )
Ayodhya: అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తామంటూ మరోసారి బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని (Uttarpradesh) ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య (Ayodhya) రామ మందిరానికి బాంబు బెదిరింపులు (Bomb threats) రావటం కలకలం సృష్టించింది. రామమందిరాన్ని పేల్చేస్తామంటూ కలెక్టరేట్లను ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ మేరకు అయోధ్య సైబర్ క్రైమ్ పీఎల్‌లో కేసు నమోదు చేశారు. తమిళనాడు నుంచి ఇంగ్లీష్​లో మెయిల్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే, అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. రామ మందిరాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరించాడు. తరచూ ఈ తరహా ఉగ్ర ముప్పుల దృష్ట్యా అయోధ్య నగరంలోనూ, రామాలయ పరిసర ప్రాంతాల్లోనూ అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు మొత్తం ప్రాంతాన్ని డ్రోన్‌ నిఘాలోకి తీసుకొచ్చారు. అలాగే, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఆలయ భద్రత కోసం దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న భద్రతా గోడ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఈ గోడ నిర్మాణాన్ని ఇంజినీర్ ఇండియా లిమిటెడ్‌ అనే సంస్థ నిర్వహిస్తోందని, ఈ గోడ నిర్మాణం 18 నెలల్లో పూర్తి కానుందని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed