- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC Champions Trophy : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు : ఇంటలిజెన్స్ వర్గాలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి ఉగ్రముప్పు పొంచి ఉందని పాక్ ఇంటలిజెన్స్(Pak Intelligence) వర్గాలు బాంబ్ పేల్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి ఉగ్రముప్పు పొంచి ఉందని పాక్ ఇంటలిజెన్స్(Pak Intelligence) వర్గాలు బాంబ్ పేల్చాయి. విదేశీయులే టార్గెట్ గా పలు ఉగ్ర సంస్థలు దాడులకు(Terrorist Attack) పాల్పడేందుకు ప్లాన్ వేస్తున్నట్టు పాక్ ప్రభుత్వానికి ఉప్పందింది. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ అతిధ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లను తిలకించడానికి వివిధ దేశాల నుంచి భారీగా విదేశీయులు ఇప్పటికే పాక్ చేరుకున్నారు. అయితే ఇపుడు వారి ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరిస్తున్నాయి నిఘా వర్గాలు. విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వానికి రహస్య సమాచారం అందినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ లోని ముఖ్య ప్రదేశాలైన ఎయిర్పోర్టులు, ఓడరేవులు, ఆఫీసులు, ఖరీదైన నివాస ప్రాంతాలపై ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ నిఘా వేసిందని ఇంటలిజెన్స్ వెల్లడించింది. ప్రత్యేకంగా పాక్ కు సహాయం చేస్తున్న చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారిని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. దీంతో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది ఆ దేశం. దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.






