- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క రాష్ట్రంలోనే పాతిక లక్షల మందికిపైగా ఉద్యోగార్థులు.. రోజ్‌గార్ పోర్టల్ చూస్తే షాక్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలిస్తే షాకవ్వడం ఖాయం.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలిస్తే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో రోజ్ గార్ పోర్టల్ చూస్తే పాతిక లక్షల మందికి పైగా ఉద్యోగార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు నమోదు చేసుకున్నారు. ఈ డేటాను ఆ రాష్ట్ర ఉపాధిశాఖ సహాయమంత్రి గౌతమ్ టెత్వాల్ వెల్లడించారు. 2025 జూన్ 30 నాటికి పోర్టల్ లో 25 లక్షల 68 వేల 321 మంది దరఖాస్తుదారులు మధ్యప్రదేశ్ రోజ్ గార్ పోర్టల్ లో నమోదు చేసుకున్నారని, వారిలో 4811 మంది వైద్యులు, 86 వేల మంది ఇంజినీర్లు, 18,800 మంది ఎంబీఏ చదివిన వారు, అత్యధికంగా 8.3 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపారు.
ఉద్యోగార్థుల్లో 13.91 లక్షల మంది పురుషులు ఉండగా.. 11.76 లక్షల మంది మహిళలు ఉన్నారు. అప్లికేషన్ల ప్రకారం చూస్తే.. అత్యధికంగా నిరుద్యోగం వెనుకబడిన తరగతుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పాతిక లక్షల మందిలో 10 లక్షల మంది ఓబీసీ వర్గానికి చెందినవారే ఉన్నట్లు వివరించారు. ఇక మధ్యప్రదేశ్ లో నిరుద్యోగి అనే పదానికి బదులు ఆకాంక్షగల యువత అని పిలుస్తున్నారు. మంత్రి చెప్పినదాని ప్రకారం 2018తో పోలిస్తే ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య తగ్గింది. 2018లో రాష్ట్రంలో 26.82 లక్షల మంది ఉద్యోగార్థులు ఉండగా.. 2023లో ఈ సంఖ్య 33.13 లక్షలకు పెరిగిందని, 2025 జూన్ నాటికి ఆ సంఖ్య పాతిక లక్షలకు తగ్గిందన్నారు.






