Rahul Gandhi: రాజకీయ కుటుంబంలో పుట్టాను.. ఓట్ల చోరీపై మరోసారి రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

ఓట్లో చోరీపై రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: రాజకీయ కుటుంబంలో పుట్టాను.. ఓట్ల చోరీపై  మరోసారి రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీతో కుమ్మక్కై ఎన్నికల సంఘం (EC) భారీ ఎత్తున ఓట్ల చోరీకి పాల్పడుతోదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల దొంగలకు (Vote Chor) శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓట్ల చోరీ కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన సమయం వచ్చినప్పుడు ఓట్ల చోరీకి పాల్పడినవారికి తప్పకుండా శిక్షపడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసిన ఆయన.. నేను రాజకీయ కుటుంబంలో జన్మించాను. నాకు ఎన్నికలు అంటే ఏమిటో తెలుసన్నారు. 20 ఏళ్లుగా నేను స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఎన్నికలు ఎలా జరుగుతాయో, పోలింగ్ బూత్ లు ఎలా మేనేజ్ చేయబడతాయి? ఓటర్ లిస్ట్, ఫామ్ -6, ఫామ్ -17 ఇవన్నీ తనకు తెలుసన్నారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటే ఫలితాలు మరో రకంగా వచ్చాయని అన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్, బీజేపీ కలిసి ఎన్నికలను చోరు చేస్తున్నాయని ఇది దేశానికి వ్యతిరేకం అన్నారు. సమయం వస్తుందని ఓట్ల చోరీకి పాల్పడిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని వ్యాఖ్యంచారు.

Next Story