ఈసారి గణతంత్ర వేడుకల వెరీ స్పెషల్.. ఫస్ట్ టైమ్ ‘యానిమల్‌ కంటింజెంట్‌’

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-31 11:36:39  IST  )

దేశంలో తొలిసారి గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రత్యేకతను సంతరించుకోబోతోంది.

ఈసారి గణతంత్ర వేడుకల వెరీ స్పెషల్.. ఫస్ట్ టైమ్ ‘యానిమల్‌ కంటింజెంట్‌’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో తొలిసారి గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. ఇండియన్ ఆర్మీ చరిత్రలో మొదటిసారి జంతు దళం (Animal Contingent) పాల్గొనబోతోంది. జనవరి 26న కర్తవ్య పథ్‌ (Kartavya Path)పై జరిగే ఈ పరేడ్‌లో జంతు దళం మార్చ్ చేయనుంది. సైనికులతో కలిసి దేశ రక్షణలో అమూల్య సేవలు అందిస్తున్న ‘సైలెంట్ వారియర్స్’ అయిన జంతువుల పట్ల గౌరవాన్ని, ఆత్మనిర్భర్ భారత్ దిశను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఈ జంతు దళం రిమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (RVC) ఆధ్వర్యంలో సన్నద్ధమైంది. మీరట్‌లోని RVC సెంటర్ అండ్ కాలేజీలో ఈ జంతువులకు శిక్షణ ఇస్తున్నారు. ఇవి సియాచెన్ గ్లేషియర్ నుంచి లడఖ్ చల్లని ఎడారుల వరకు అతి కఠినమైన ప్రాంతాల్లో సైనికులతో కలిసి పనిచేస్తున్నాయి.

భారత సైన్యంలో జంతు దళం ఇలా...

ఇప్పటి వరకు 2 బ్యాక్ట్రియన్ ఒంటెలు (Bactrian Camels) ఉన్నాయి. ఇవి లడఖ్ (Ladakh) చల్లని ఎడారుల్లో లాజిస్టిక్స్, పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. 15 వేల అడుగుల ఎత్తులో -40°C వరకు తట్టుకుని 250 కేజీల వరకు బరువు మోసుకెళ్తాయి. తక్కువ నీరు, ఆహారంతో దూరాలు ప్రయాణిస్తాయి. ఇక 4 జాన్స్కార్ పోనీలు (Zanskar Ponies) కూడా సేవలందిస్తున్నాయి. లడఖ్ స్థానిక జాతికి చెందిన ఇవి చిన్న పరిమాణంలో ఉన్నా సుమారు 40-60 కేజీల బరువు మోసుకెళ్తాయి. సియాచెన్ వంటి అతి ఎత్తైన, చల్లని ప్రాంతాల్లో లాజిస్టిక్స్, మౌంటెడ్ పెట్రోల్స్‌కు కీలక పాత్ర పోషిస్తూ... 2020 నుంచి సర్వీసులో ఉన్నాయి. అలాగే 4 ర్యాప్టర్స్ (గద్దలు) ఎయిర్‌ఫీల్డ్ సేఫ్టీ, సర్వైలెన్స్ కోసం వినియోగిస్తున్నారు. చివరగా ముద్హోల్ హౌండ్, రాంపూర్ హౌండ్, చిప్పిపరై, కొంబై, రాజపాలయం వంటి స్థానిక జాతులకు చెందిన 10 భారతీయ జాతి ఆర్మీ డాగ్స్, 6 సాధారణ మిలటరీ డాగ్స్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో యాక్టివ్ సర్వీసులో ఉన్నాయి. ఈ డాగ్స్‌ను ‘సైలెంట్ వారియర్స్’గా పిలుస్తారు. కౌంటర్ టెర్రరిజం, బాంబు అండ్ మైన్ డిటెక్షన్, ట్రాకింగ్, గార్డింగ్, డిజాస్టర్ రెస్పాన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

Next Story