Yogi Adityanath : ఇది యూనికార్న్ మహా కుంభ్ : సీఎం యోగి

by Y. Venkata Narasimha Reddy |

ఉత్తర ప్రదేశ్ (UP) రాష్ట్రం ప్రయాగ్ రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela)కి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ఆదివారం వెల్లడించారు.

Yogi Adityanath : ఇది యూనికార్న్ మహా కుంభ్ : సీఎం యోగి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ (UP) రాష్ట్రం ప్రయాగ్ రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela)కి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ఆదివారం వెల్లడించారు. నిర్దిష్ట కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం "శతాబ్దంలోనే అరుదైన సంఘటన' గా అభివర్ణించారు. అగ్రాలో జరిగిన యూనికార్న్ కంపెనీ సమావేశంలో యోగి హాజరై మాట్లాడారు. మహాకుంభ మేళా కార్యక్రమాన్ని నేటీ స్టార్టప్ ప్రపంచంలోని యూనికార్న్ మహా కుంభ్ గా చెప్పవచ్చని అన్నారు. దేశ చారిత్రాక, సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి తీసుకురావడానికి మహా కుంభమేళా ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఉపయోగపడుతుందని యోగి విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రతి 144సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా జనవరి 13వ తేదీన ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహా కుంభమేళా చివరి దశకు చేరింది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం తొలుత వేసిన అంచనా ఇప్పటికే దాటి పోయింది. ఇంకా మహాశివరాత్రి పుణ్యస్నానాలు మిగిలే ఉన్నందునా మరింత మంది భక్తుల రద్దీ కొనసాగుతుందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. మహా కుంభమేళాలో చివరి రోజైన ఫిబ్రవరి 26న రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంది.

వరల్డ్ పాపులేషన్ రివ్యూ, ప్యూ రీసెర్చ్ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశ జనాభా సుమారు 143 కోట్లు కాగా అందులో 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారు 120 కోట్ల మంది ఉంటారని ప్యూ రీసర్చ్ 2024లో వెలువరించిన గణాంకాలు తెలుపుతున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. భూటాన్ రాజు జిగ్మె బేసర్ సంగ్యేల్ వాంగ్ ఛుక్ తో సహా 73 దేశాల దౌత్యవేత్తలు మహా కుంభమేళా సందర్భంగా సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. జానకీ మాత పుట్టినిల్లయిన నేపాల్ కు చెందిన 50 లక్షల మంది కూడా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు అని ప్రకటన పేర్కొనడం ఆసక్తికరం.

Next Story