- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Underground Hotel: ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ హోటల్ ఇదే .. ఎక్కడ ఉందంటే ? (వీడియో )
ఇది భూమికి 1,300 అడుగుల లోతులో ఉంది

దిశ, వెబ్ డెస్క్ : హాలిడేస్ రాగానే కొత్త కొత్త ప్రదేశాలకు తిరుగుతుంటారు. మనం ఏదైనా తెలియని ప్లేస్ కి వెళ్లినప్పుడు, రాత్రికి అక్కడే రూమ్ తీసుకుని ఉండిపోతాము. ఇక ట్రెక్కింగ్ కి వెళ్లినప్పుడు, అక్కడ కనిపించే అన్నింటినీ ఫోటోలు, వీడియోలు తీసుకుని యాత్రలను మరింత ప్రత్యేకంగా మారుస్తాము. అయితే, మనం ఇప్పటి వరకు భూమి పైన ఎన్నో హోటల్స్ ను చూశాము. కానీ , ఇప్పుడు చెప్పబోయే హోటల్ మాత్రం చాలా చాలా స్పెషల్ . దీని గురించి తెలుసుకున్నాక అసలు అక్కడికి వెళ్ళగలమా అని అనుకుని ఆగిపోతారు. ప్రస్తుతం, ఈ హోటల్ ఇంటర్నెట్‌నే షేక్ చేస్తుంది. అసలు అది ఎక్కడ ఉందో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ వరల్డ్ లోనే అత్యంత లోతైన భూగర్భ హోటల్ 'డీప్ స్లీప్' (Deep sleep ) నార్త్ వేల్స్‌లో ఉంది. ఇది భూమికి 1,300 అడుగుల లోతులో ఉంది. 100 అడుగుల లోతునే చూసి వామ్మో ఇదేంటి ఇలా ఉందని అనుకుంటాము. మరి అలాంటిది ఇన్ని వందల అడుగులో లోతులో ఎలా నిర్మించారో అసలు..! కానీ, చూడటానికి చాలా అందంగా ఉంది. వ్లాగర్ కారా బుకానన్ ఈ హోటల్ కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది.
ఈ హోటల్ భూగర్భంలో ఉండటంతో, అక్కడి ఫుడ్ ఏర్పాట్లు, రూమ్ టెంపరేచర్ ఎలా ఉంటుందో అని మీరు ఊహించవచ్చు. అయితే, ఇది నార్మల్ హోటల్‌లా కాకుండా స్పెషల్ గా ఉంటుందని ఆమె చెబుతోంది. వ్లాగర్ కారా బుకానన్ ఈ హోటల్‌లో గడిపిన అనుభవాలను అందరితో పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో 'ది వరల్డ్’స్ డీపెస్ట్ స్టే' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






