ప్రతీక్ యాదవ్ మరణానికి కారణం ఇదే..! పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు

by Kema Shiva Kumar |

సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రతీక్ యాదవ్ పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రతీక్ యాదవ్ మరణానికి కారణం ఇదే..! పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: సమాజ్‌వాదీ నేత, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కుమారుడు ప్రతీక్ యాదవ్ (Prateek Yadav) ఆకస్మిక మరణంపై అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి. అయితే, అతడి సడెన్ డెత్‌పై సందిగ్ధతకు పోస్ట్‌మార్టం నివేదికతో తెరపడింది. ఆయన మరణానికి ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడమే (Blood clot in lungs) ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. అయితే, ప్రతీక్ యాదవ్ పల్మనరీ ఎంబోలిజం (Pulmonary Embolism)తో మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలింది. ఊపిరితిత్తులకు రక్తాన్ని చేరవేసే ధమనులలో రక్తం గడ్డకట్టడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రతీక్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మరణించారు. నిత్యం ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టే ప్రతీక్, ఇలా ఊపిరితిత్తుల సమస్యతో మరణించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Next Story