- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇది జర్నలిజం కాదు’.. బాడీ షేమింగ్ కామెంట్‌పై సారా టెండూల్కర్ ఆగ్రహం
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో బాడీ షేమింగ్‌కు గురయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో బాడీ షేమింగ్‌కు గురయ్యారు. తనతో పాటు తన వదిన సానియాపై ఓ పాపరాజీ (ఫోటోగ్రాఫర్) పేజీ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది జర్నలిజం కాదని, తమను ప్రశాంతంగా వదిలేయాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల సారా, ఆమె వదిన సానియా కలిసి ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ వారి వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, దానికి అత్యంత అభ్యంతరకరమైన, బాడీ షేమింగ్‌కు సంబంధించిన క్యాప్షన్‌ను జత చేశాడు. ఈ వీడియోపై సారా టెండూల్కర్ తీవ్రంగా స్పందించారు.
మీరు చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ సదరు పాపరాజీ అకౌంట్‌పై విరుచుకుపడ్డారు. ‘మీరు చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం జర్నలిజం అనిపించుకోదు. మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి’ అని పోస్ట్ చేశారు. సారా ఆగ్రహంతో ఆ పేజీ నిర్వాహకులు వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అయినప్పటికీ సారా శాంతించలేదు. సదరు అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘మీరు మీ పోస్ట్‌ను డిలీట్ చేసి ఉండొచ్చు, కానీ అది మీలోని అసహ్యకరమైన ఆలోచనా విధానాన్ని ఏమాత్రం మార్చదు’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.
ఇటీవలే అర్జున్ టెండూల్కర్ వివాహం
సారా టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే తన సోదరుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా ఆమె పంచుకున్నారు. మార్చి 5న ముంబైలో వ్యాపారవేత్త సానియా చంధోక్‌తో అర్జున్ టెండూల్కర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి తర్వాత ఎయిర్‌పోర్టులో కనిపించిన సారా, తన వదిన సానియాలపై పాపరాజీ (ఫోటోగ్రాఫర్) ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేయడం పట్ల నెటిజన్లు సైతం సారాకు మద్దతుగా నిలుస్తూ సదరు ఫోటోగ్రాఫర్ తీరును తప్పుబడుతున్నారు.






