ఇది నేషనల్ హెరాల్డ్ కేసు కాదు.. నేషనల్ వేధింపుల కేసు: అభిషేక్ మను సింఘ్వీ

by Malleboina Mahesh |

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.

ఇది నేషనల్ హెరాల్డ్ కేసు కాదు.. నేషనల్ వేధింపుల కేసు: అభిషేక్ మను సింఘ్వీ
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవుల్ని దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్రకేసు నమోదు చేశారు. కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంపై కాంగ్రెస్ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ పరిస్థితి అసంబద్ధంగా ఉందని (bizarre) అభివర్ణించిన ఆయన, "ఇక్కడ నేరం లేదు, నగదు లేదు, ఆనవాళ్లు లేవు. అయినప్పటికీ బీజేపీ తన వక్రీకృత మనస్సుతో ఈ కేసును సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, "న్యాయం అంధమైతే, ఈడీ వర్ణాంధత్వం కలిగి ఉంది. ఎటువంటి డబ్బు లేదా స్థిరాస్తి లావాదేవీలు లేకపోయినా, దుర్వినియోగం జరగకపోయినా, ఈడీ తన ఊహల్లో మనీలాండరింగ్‌ను చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

సింఘ్వీ తన విమర్శలను మరింత తీవ్రం చేస్తూ, బీజేపీపై పరోక్ష దాడి చేశారు. "ఈ రోజు కల్పిత కథకు యూనిఫాం లభించింది. కక్ష సాధింపు (Vendetta) గనుక సిలబస్ అయితే, బీజేపీ అందులో గౌరవ పట్టా పొందుతుంది," అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక ప్రైవేట్ ఫిర్యాదుతో మొదలైన నేషనల్ హెరాల్డ్ కేసు, బీజేపీకి ఒక పాత అలవాటుగా, నిత్యం పునరావృతమయ్యే బలవంతపు చర్యగా మారిందని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని 'నేషనల్ హెరాల్డ్ కేసు' అని కాకుండా, 'నేషనల్ వేధింపుల కేసు' (National Harassment Case) అని అభిషేక్ మను సింఘ్వీ అభివర్ణించారు.

Next Story