- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది నా డ్యూటీ. అందుకే రావాల్సి వచ్చింది!.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
ఇది నా డ్యూటీ. అందుకే రావాల్సి వచ్చిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇది నా డ్యూటీ. అందుకే రావాల్సి వచ్చిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హజరైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి రావడం నా డ్యూటీ. అందుకే హజరయ్యానని అన్నారు. నేను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని, రాజ్యాంగ బాధ్యతల కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సి వచ్చిందని తెలిపారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయనను నేను కలిస్తే చూస్తాను అని సమాధానం ఇచ్చారు.
కాగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆదివారం మూడో సారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులోనే మోడీతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్ లో ఇప్పటికే అన్ని ఏర్పాటు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు విదేశీ ప్రముఖులతో పాటు దేశానికి చెందిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.






