- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్యానాలో ఐస్‌క్రీం అమ్ముకుంటున్న పాక్ మాజీ ఎంపీ!
ఇటీవల పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థానీలు భారత్ నుండి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థానీలు భారత్ నుండి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలతో పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 537 మంది అట్టారి వాఘా సరిహద్దు ద్వారా భారత్ నుండి వెళ్లిపోయారు. భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీల్లో ఓ మాజీ పాకిస్థాన్ ఎంపీ కూడా ఉండటం విశేషం. దబాయా రామ్ అనే పాక్ మాజీ ఎంపీ కుటుంబం హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో నివసిస్తోంది. మాజీ ఎంపీ అయినప్పటికీ దబాయా రామ్ ప్రస్తుతం ఐస్‌క్రీం అమ్ముకుని కుటుంబాన్ని పోశించుకుంటున్నారు.
ఆయనతో పాటూ 34మంది కుటుంబ సభ్యులు కూడా ఇండియా వచ్చారు. వారిలో ఆరుగురికి మాత్రమే భారత పౌరసత్వం ఉండగా మిగిలిన 28 పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని చాలా కాలం అయినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ పంజాబ్ విభజనకు రెండేళ్లు ముందు దబయ్ రామ్ జన్మించగా ఆయన కుటుంబం పాకిస్థాన్‌లో నివసించింది. 1988లో ఆయన పాకిస్థాన్‌లో ఓ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రామ్ కుటుంబ సభ్యురాలిని తీవ్రవాదులు ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయింది. పాకిస్థాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగలేదు. దీంతో ఆ దేశంలో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి కుటుంబంతో సాహా ఆయన ఇండియాకు వచ్చినట్టు చెబుతున్నారు. అప్పటి నుండి సైకిల్ పై కుల్ఫీలు, ఐస్‌క్రీంలు అమ్మడం ద్వారా కుటుంబాన్ని పోశించుకున్నారు. అతని ఏడుగురు కుమారులు వివాహం చేసుకుని భారత్‌లోనే స్థిరపడ్డారు. కానీ పాక్ పౌరసత్వం ఉండటంతో వారి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దబయ్ రామ్‌కు భారత పౌరసత్వం ఉండటంతో తన కుటుంబ సభ్యులకు సైతం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.






