- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం ప్రాంతంలో వరుసగా మూడో పేళుడు
by Malleboina Mahesh |
పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయ పరిసర ప్రాంతాలు వరుస పేలుళ్లతో ఆందోళన మయంగా మారిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయ పరిసర ప్రాంతాలు వరుస పేలుళ్లతో ఆందోళన మయంగా మారిపోయింది. గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో శనివారం (మే 6) మరియు సోమవారం (మే 8) రెండు పేలుళ్లు సంభవించిన తర్వాత తాజాగా గురువారం తెల్లవారుజామున మరో పేలుడు సంభవించింది. కాగా వరుసగా ఏడు రోజుల వ్యవధిలో ఇది మూడో పేలుడు.
గురువారం జరిగిన పేలుడు తక్కువ తీవ్రతతో కూడినది కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అలాగే ఈ పేలుడుకు సంబంధించిన ఐదుగురు కుట్రదారులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో శాంతికి విఘాతం కలిగించడానికి ఈ పేలుళ్లు సృష్టిస్తున్నట్టు పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు. బాణసంచా తయారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలను పేలుడులో ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






