గొంతు నొక్కారు.. కానీ ఓడించలేరు: ఆప్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |

రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగించడమే కాకుండా, పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం లేకుండా చేసిన పార్టీపై ఎంపీ రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు.

గొంతు నొక్కారు.. కానీ ఓడించలేరు: ఆప్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా బద్ధలైంది. పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం పోటీ పడ్డారని భావిస్తున్న రాఘవ్ చద్దాను రాజ్యసభ (Rajya Sabha) ఉపనేత పదవి నుంచి తొలగించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పదవి నుంచి తొలగించడమే కాకుండా, పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పార్టీ ఆంక్షలు విధించడంపై రాఘవ్ చద్దా తొలిసారి స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను నిశ్శబ్దంగా ఉండేలా చేశారు కానీ, నేను ఓడిపోలేదు’ అని అన్నారు. పార్లమెంట్‌లో తన గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. తాను మౌనంగా ఉన్నానంటే అది తన బలహీనత కాదని, అదొక నిరసన అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలు లేవనెత్తడం తప్పా?

సొంత పార్టీ తనపై తీసుకున్న చర్యలను రాఘవ్ చద్దా నేరుగా ప్రశ్నించారు. తాను పార్లమెంట్‌లో సామాన్యుల పక్షాన నిలబడి మాట్లాడానని గుర్తు చేశారు. గిగ్ వర్కర్ల కష్టాలు, విమాన ప్రయాణ చార్జీల బాదుడు, సామాన్యుల జేబుకు చిల్లు పెట్టే ప్రభుత్వ నిర్ణయాలపై గళమెత్తానని తెలిపారు. ‘ప్రజా సమస్యలపై మాట్లాడటం తప్పా? నా వల్ల సామాన్యులకు మేలు జరిగిందే తప్ప ఎవరికీ నష్టం కలగలేదు’అని రాఘవ్ చద్దా భావోద్వేగానికి లోనయ్యారు.

Next Story