- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా భయపడింది
అమెరికా విధించిన సుంకాలు అంతర్జాతీయ ట్రేడ్ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని అంతకు ముందు చైనా ఆరోపించింది.

- టారిఫ్‌లపై తప్పుడు నిర్ణయం
- వెల్లడించిన ప్రెసిడెంట్ ట్రంప్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువలపై చైనా 34 శాతం అదనపు సుంకం విధించడంపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాము విధించిన సుంకాలపై చైనా ప్రతీకారం తీర్చుకుందని, ఆ దేశం భయపడిందని అన్నారు. చైనా తప్పు చేసిందని.. వారు భయాందోళనకు గురయ్యారని.. అందుకే వారికి సుంకాలను పెంచడం తప్ప మరో మార్గం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్య యుద్దంలో స్టాక్ మార్కెట్ భయాందోళనలో ఉన్న సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధనవంతులు కావడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కాగా, రెండో రోజు కూడా అమెరికా మార్కెట్లు వరుసగా పతనమయ్యాయి. వాల్‌స్ట్రీట్ మంచి అమ్మకాలతో ప్రారంభమైంది. అదే సమయంలో డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 రెండూ కూడా దాదాపు 3 శాతం నష్టపోయాయి. ఫ్రాంక్‌ఫర్ట్. లండన్ సూచీలు కూడా నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి. జపాన్ నిక్కీ 2.8 శాతం మేర నష్టపోయింది. కాగా, అమెరికా విధించిన సుంకాలు అంతర్జాతీయ ట్రేడ్ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని అంతకు ముందు చైనా ఆరోపించింది. అమెరికా ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పింది.






