‘దేశాన్ని వీడారు.. మన దేశ ఆత్మను కాదు’.. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మోడీ

by Phanindra |   (  Updated:2025-07-04 15:15:57  IST  )

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్న మోడీ.. ఇక్కడి ప్రవాసీయులను ఉద్దేశించి ప్రసింగించారు. ‘మీరంతా దేశాన్ని వీడారు.. ఆ దేశ ఆత్మను కాదు’ అన్నారు.

‘దేశాన్ని వీడారు.. మన దేశ ఆత్మను కాదు’.. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘వీళ్లంతా గంగా, యమునను వదిలి వచ్చారు. కానీ తమ మనసుల్లో రామాయణాన్ని తీసుకొచ్చారు. వాళ్లు నేలను వదిలారే కానీ ఆత్మను కాదు. వీళ్లు కేవలం వలసదారులు కాదు. అంతంలేని నాగరికతను తీసుకొచ్చిన ప్రవక్తలు’ అని మోడీ అన్నారు. అలాగే ఈ దేశాభివృద్ధిలో కూడా ప్రవాసీల పాత్ర ఎంతో ఉందన్నారు. ‘సాంస్కృతికంగా, ఆర్థికంగా, స్పిరిచ్యువల్‌గా.. అన్ని విభాగాల్లో ఈ దేశానికి వీళ్లు మంచి చేశారు. ఈ అందమైన దేశంపై మీ ప్రభావం చూడండి’ అని ప్రవాసీ కమ్యూనిటీకి చెప్పారు.

తనతోపాటు అయోధ్య రామాలయం ప్రతిమను, సరయూ నది నీటిని తెచ్చానని మోడీ అన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర మహాకుంభ్ ఇటీవలే జరిగిన సంగతి మీకు తెలుసు. ఆ నీటిని మీకోసం ఇక్కడకు తీసుకొచ్చాను. ఇక్కడి గంగా ధారలో సరయూ, మహాకుంభ్ నీటిని కలపాలని కమల గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలను ఈ పవిత్ర జలాలు ఆశీర్వదిస్తాయని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

గిర్మితీయ కమ్యూనిటీ డేటాబేస్ తయారు చేసేందుకు కూడా తాము ప్రయత్నిస్తున్నట్లు మోడీ చెప్పారు. బ్రిటిష్ హయాంలో సౌతాఫ్రికా, ఫిజీ, మారిషియస్, కరీబియన్ దీవుల్లో ఉన్న ప్లాంటేషన్లలో పనిచేసేందుకు భారతీయులను పంపించారు. వీరిని గిర్మితీయులు అంటారు.

Next Story