Surprise: వామ్మో.. ఏడడుగుల పొట్లకాయలు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-18 05:36:18  IST  )

తమిళనాడులో ఏడడగుల పొట్లకాయలను చూసి ఆశ్చర్యపోతున్నారు..

Surprise: వామ్మో.. ఏడడుగుల పొట్లకాయలు..!
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు అడుగులు లేదా ఐదు అడుగుల పొట్లకాయ(POTLAKAYA )ను చూస్తేనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. అలాంటిది ఏకంగా ఏడడుగుల పొట్లకాయ చూస్తే కెవ్వు కేక అంటాం. సరిగ్గా ఇలాంటిదే మన రాష్ట్రంలో జరిగింది. ఓ రైతుకు చెందిన పొలంలో ఏడుగుల పొట్లకాయ కాసింది. దీంతో ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.


తమిళనాడు రాష్ట్రం(Tamil Nadu State) కోయంబత్తూరు జిల్లా ఆనైమలై( Animalai) పరిసర ప్రాంతాల్లో కొబ్బరి, వరి, కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుంది. అలాగే పందిరి తోటలు వేసి మరీ పొట్లకాయ, కాకరకాయలను పండిస్తారు. ఆనైమలై సమీప గ్రామం బెత్తనాయకనూర్‌కు చెందిన రైతు జ్యోతిమణి(Farmer Jyotimani) అనే రైతు ప్రతీసారి మాదిరిగా తన అరెకరం పొలంలో పొట్లకాయ పంట వేశారు. మూడు నెలలుగా సాగు చేశారు. పొట్లకాయలు విపరీతంగా చేతికి వచ్చాయి. అయితే ఇందులో 10కిపైగా పొట్లకాయలు ఏడడగులున్నాయి. దీంతో చుట్టు పక్కల వాళ్లు భారీగా తరలివచ్చి వింతగా చూస్తున్నారు. వామ్మో.. ఇంతపొడుగు ఉంది ఏంటి ని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పొట్లకాయలకు భారీగా డిమాండ్ ఉంటుందని రైతు జ్యోతి మణి తెలిపారు. ఈ ఏడాది పొట్లకాయ పంట భారీగా చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.

Next Story