మహాభారతంలోనూ వారి ప్రస్తావన ఉంది: RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహాభారతంలోనూ వారి ప్రస్తావన ఉంది: RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్జీబీటీక్యూ (LGBTQ) సమాజానికి చెందిన వారు కూడా మనుషులేనని, వారికీ జీవించే హక్కు ఉన్నందున వారిని సమాజం నుంచి వేరు చేయకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భారతీయ సంప్రదాయాలు ప్రాచీన కాలం నుంచే ఇలాంటి వర్గాలను గుర్తించాయని చెప్పుకొచ్చారు. భారతీయ సమాజంలో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (Transgender), క్వీర్/క్వెస్టింగ్ వారు కూడా ఓ భాగమని, వారికి తగిన గౌరవంతో పాటు స్వేచ్ఛాయుత స్థానం లభించాలని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.

ఈ మధ్య కాలంలో ఎల్జీబీటీక్యూ గురించి విరివిగా మాట్లాడుకుంటున్నారని మోహన్ భాగవత్ అన్నారు. ఇలాంటి ప్రవృత్తులు సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నాయని తెలిపారు. కొన్ని స్వభావికంగా, ప్రకృతిసిద్ధంగా నిర్ణయించబడతాయని.. మరికొన్ని ఆలోచనా విధానం, శారీరక మొగ్గు వల్ల ఏర్పడతాయని, ఇవి అన్ని చోట్లా ఉంటాయని అన్నారు. మన సమాజంలో ఇవి లేవు అని చెప్పలేము. ఇక మహాభారతంలో శిఖండి (Shikhandi) పాత్రను ప్రస్తావిస్తూ, అప్పట్లోనే ఇలాంటి వారికి సమాజంలో తగిన స్థానం ఇచ్చారని గుర్తుచేశారు. ఈ విషయాలపై అనవసర హంగామా చేయకుండా, సమాజం వారి పట్ల సానుభూతితో మెలిగేలా భారతీయ సంప్రదాయం వ్యవహరించిందని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. అయితే, ఇన్నాళ్లు ‘ఎల్జీబీటీక్యూ’ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ భిన్నమైన వైఖరితో ఉందనే ప్రచారానికి ఇవాళ ఎండ్ కార్డ్ వేసినట్లైంది.

Next Story