Manishankar Ayyar : హిందువుల మనసుల్లో ద్వేషాన్ని నింపుతున్నారు : మణిశంకర్ అయ్యర్

by Muthe.Rajitha |

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్(Congress Leader Manishankar Aiyar) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Manishankar Ayyar : హిందువుల మనసుల్లో ద్వేషాన్ని నింపుతున్నారు : మణిశంకర్ అయ్యర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్(Congress Leader Manishankar Aiyar) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశప్రజల్లో ద్వేషాన్ని నింపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచంలో నివసిస్తున్న ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు(Eid Mubarak) తెలియ జేసిన ఆయన.. అధికార బీజేపీ(BJP) పార్టీపై కీలక ఆరోపణలు చేశారు. భారత్ లో సామరస్య వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇది అధికారంలో ఉన్న నాయకుల ఆదేశాల మేరకు జరుగుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

అదృష్టవశాత్తు ఇలాంటి విద్వేషాలకు ఎక్కువ మంది ప్రజలు మద్దతు ఇవ్వనందున వారి లక్ష్యం నెరవేరదని తెలిపారు. భారత్ లో ఉన్న మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది హిందుస్థానీలు మైనారిటీల మధ్య విరోధాన్ని సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. దేశాన్ని హిందూ దేశం (Hindu Rashtra)గా మార్చాలని చూస్తున్న రాజకీయ శక్తులకు ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మద్దతు ఇవ్వరని పేర్కొన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం అని, ఇక్కడ అన్ని మతాల ప్రజలు సోదరభావంతో, సామరస్యంగా జీవిస్తారని ఆయన చెప్పారు.

Next Story