విడాకుల కేసు ముగిసే వరకు సినిమాల్లో నటించను.. మీడియా ముందు బోరున ఏడ్చేసిన నటుడు జయం రవి

by Prasad Jukanti |

విడాకుల వ్యవహారంపై నటుడు జయం రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పెళ్లి రోజు నుంచే నరకం.. చేతబడి కూడా చేశారు' అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

విడాకుల కేసు ముగిసే వరకు సినిమాల్లో నటించను.. మీడియా ముందు బోరున ఏడ్చేసిన నటుడు జయం రవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: విడాకుల వ్యవహారంపై నటుడు జయం రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం ఎంతో సహనంతో ఉన్నానని వ్యక్తిగత విషయాలు ఎక్కడా మాట్లాడలేదన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని ఇక అవమానాలు భరించడం తన వల్ల కావడంలేదన్నారు. వాళ చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన తన పిల్లలను సైతం తన నుంచి దూరం చేస్తున్నారని మీడియా ఎదుటే కన్నీరు పెట్టుకున్నారు. ఏడాదికి రూ. 50 లక్షలు కట్టి పిల్లల్ని చదివిస్తున్నానని నా పిల్లల్ని ఎలా వదులుకుంటానన్నారు. పిల్లల్ని అడ్డం పెట్టుకుని అవమానించవద్దని ఇక అవమానాలను భరించడం నా వల్ల కావడం లేదంటూ ఎమోషన్ అయ్యారు. తనను ఇబ్బంది పెట్టాలనుకునే వారు నేరుగా తన ఆఫీసుకు రావొచ్చని ఇకపై నేను మౌనంగా ఉండదలుచుకోవడం లేదన్నారు. అయితే జయం రవి తన భార్య ఆర్తితో విడాకుల ప్రకటన ఇండస్ట్రీలో నివురుగప్పిన నిప్పులా మారింది. వీరి విడాకులకు రవితో సింగర్ కేనీషాతో రిలేషన్ షిపే కారణం అంటూ పెత్త ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా సింగర్ కెనీషా కూడా రవితో తనకున్న రిలేషన్ కు బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన రవి ఈ విమాదాలపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

కేసు ముగిసే వరకు సినిమాలు చేయను:

తన విడాకుల కేసు ముగిసే వరకు సినిమాల్లో నటించబోనని రవి స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో కొన్ని విషాలు ప్రత్యక్షంగా నా అభిమానులతో చెప్పాలనుకుంటున్నాని. ఇంతకాలం నా వ్యక్తిగత జీవితాన్ని మీతో పంచుకోలేదు. ఇందుకు క్షమించండి. నాకు విడాకులు వస్తాయా రావా అనేది పక్కన పెడితే నాపై జరుగుతున్న ట్రోలింగ్ నన్ను బాధిస్తోందన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతోందని ఇన్నేళ్లు ఎలాంటి మచ్చలేకుండా బతికిన తాను పెళ్లి చేసుకున్నాక నరకం చూశానన్నారు. పెళ్లైన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్ స్టార్ట్ అయ్యాయని చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడు నేను వారి చెప్పుచేతుల్లో ఉండేలా నాపై చేతబడి కూడా చేశారని ఆరోపించారు. దాని ప్రభావం వల్ల ఇప్పుడు నాకు రక్తంతో వాంతులు అవుతున్నాయని నన్ను చంపేయాలనే కుట్ర కూడా జరుగుతోందని ఆరోపించారు.

Next Story