- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ మహదేవ్ లో హతమైన ఉగ్రవాదులు వీరే.. ఆర్మీ కీలక ప్రకటన
by Naga Rani Yarlagadda |
పహల్గామ్ లో కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్..

X
దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ లో కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్.. ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) సక్సెస్ అయిందని ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఎన్కౌంటర్ నిర్వహించాలనుకున్న ప్రాంతం జబర్వన్ - మహదేవ్ పర్వతాల మధ్య ఉండటంతో.. ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ మహదేవ్ అనే పేరును పెట్టారు. దాచిగామ్ అడవుల్లో నిర్వహించిన ఎన్కౌంటర్లో ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అనే ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఆర్మీ తెలిపింది. ఒక్కో ఉగ్రవాదిపై రూ.20 లక్షల రివార్డు ఉందని పేర్కొంది. మరో ఇద్దరు ఉగ్రవాదులు గాయాలతో పట్టుబడ్డారని వెల్లడించింది.
Next Story






