పాక్‌ ఉగ్రవాదులకు చుక్కలు చూపించిన క్షిపణులు ఇవే!

by velandi.Saikiran |   (  Updated:2025-05-07 10:53:33  IST  )

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ( Pakistani terrorists) మోడీ ప్రభుత్వం ( Modi Govt) చుక్కలు చూపిస్తోంది. అర్ధరాత్రి ఆపరేషన్ సిందూ

పాక్‌ ఉగ్రవాదులకు చుక్కలు చూపించిన క్షిపణులు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ( Pakistani terrorists) మోడీ ప్రభుత్వం ( Modi Govt) చుక్కలు చూపిస్తోంది. అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor) ప్రారంభించిన మోడీ ప్రభుత్వం... దాదాపు తొమ్మిది స్థావరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం దాడికి ప్రతిఘటనగా ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టిస్తోంది మోడీ ప్రభుత్వం.

ఊపిరి కూడా తీసుకునే పరిస్థితి ఉగ్రవాదులకు ప్రస్తుతం లేదని సమాచారం. అంతలా ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ దేశంలో కూడా దాదాపు ఎమర్జెన్సీ పాలన వచ్చినట్లేనని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించిన క్షిపణులు ఏవి ? అనే చర్చ జరుగుతోంది.

ఈ ఆపరేషన్ లో స్కాల్ప్ క్షిపణులు ( Scalp missiles ) అలాగే హ్యూమర్ బాంబులను ( Humor bombs ) ఇండియన్ ఆర్మీ వాడినట్లు సమాచారం అందుతోంది. వాస్తవానికి ఇలాంటి మిలటరీ ఆపరేషన్లకు ఏ రకమైన ఆయుధాలు వాడరు? అన్నది ఎప్పుడు కూడా బహిర్గతం చేయరు. కానీ అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా నిపుణులు ఓ అంచనాకు... వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వీటిని మాత్రమే వాడినట్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ ఆపరేషన్ లో సూసైడ్ డ్రోన్లను కూడా ఉపయోగించినట్లు సమాచారం అందుతుంది.

Read More: Operation Sindoor: పాక్ రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు.. పలు దేశాల ఎన్ఎస్ఏలకు అజిత్ దోవల్ ఫోన్

Next Story