- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్ సాక్షిగా మోడీ అబద్దాలు ఇవే.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హాట్ కామెంట్స్
ప్రధాని మోడీ చెప్పిన అబద్దాలు ఇవేనని, ఆయన చెప్పిన ప్యాకేజీ ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress National President Mallikarjuna Karge) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ చెప్పిన అబద్దాలు ఇవేనని, ఆయన చెప్పిన ప్యాకేజీ ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress National President Mallikarjuna Karge) విమర్శించారు. బీహార్ (Bihar)లోని బక్సర్ పర్యటన (Baxur Tour)లో ఉన్న ఖర్గే.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ (PM Modi), బీజేపీ (BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆనాడు పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ11 అబద్దాలు చెప్పారని, ఆ అబద్దాలనే నేను మీకు చెబుతాను అంటూ..
1. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని (Black Money) 100 రోజుల్లో వెనక్కి తెస్తాను
2. నేను ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ (Money Deposit) చేస్తాను
3. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు (Employement) కల్పిస్తాను
4. పెట్రోల్, డీజిల్ మరియు LPG గ్యాస్ చౌకగా మారతాయి. అందుకు విరుద్ధంగా వీటన్నింటి ధరలు పెంచారని తెలిపారు. అంతేగాక
5. 2022 నాటికి గంగ శుభ్రం అవుతుంది
6. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు అవుతుంది
7. 2022 నాటికి ప్రతి భారతీయునికి ఇల్లు నిర్మించి ఇస్తాను
8. 2022 నాటికి ఇండియాలో బుల్లెట్ రైలు (Bullet Train) పరుగులు ప్రారంభమవుతాయి
9. రైతులందరికీ ఎమ్మెస్పీ(MSP) హామీ లభిస్తుంది
10. ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తాను
11. మేక్ ఇన్ ఇండియా (Make In India) ఫ్యాక్టరీలను సృష్టిస్తుంది అని చెప్పారని, కానీ ఇవేమి జరగలేదని అన్నారు. అలాగే బీహార్ ప్రజలకు 12వ అబద్ధం కూడా బాగా గుర్తుండి ఉంటుందని, బీహార్ కు 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తానని మోడీ ప్రకటన చేశారని గుర్తు చేశారు. 2015 ఆగస్ట్ 18న వీర్ కున్వర్ సింగ్ (Veer Kunvar Sing) భూమిలో నిలబడి మోడీ మాట్లాడుతూ.."నా వాగ్దానాన్ని నెరవేర్చేందుకే ఇక్కడికి వచ్చాను.. 50 వేల కోట్లు అని నేను చెప్పాను.. మీకు ఎంత కావాలి? 60 వేల కోట్లు, 70 వేల కోట్లు, 80 లేదా 90 వేల కోట్లు? నేను ఇక్కడ రూ. 1 కోట్ల 25 వేల ప్యాకేజీని ప్రకటిస్తున్నాను" అని చెప్పారని తెలిపారు. కానీ ఆ 1.25 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో ఎవరికి తెలియదని ఖర్గే ఎద్దేవా చేశారు.






