- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెలివరీ పేరుతో టెకీపై లైంగిక దాడి.. సెల్ఫీ వీడియోలో షాకింగ్ సీన్స్!
చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగటం లేదు.

దిశ, వెబ్ డెస్క్: చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగటం లేదు. రోజురోజుకూ మరింతగా మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తమ కామవాంఛ కోసం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. చివరికి ఆడవాళ్లను బయటకి ఒంటరిగా పంపటం కాదు, ఇప్పుడు సొంత ఇంట్లోనూ ఒంటరిగా ఉంచలేని దుస్థితి ఏర్పడింది. మన భద్రతగా భావించే ఇంట్లోనే ప్రమాదం పొంచి ఉందనిపించేలా.. మహారాష్ట్ర పుణెలో జరిగిన ఓ ఘోర సంఘటన ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు.
మహారాష్ట్రలోని పుణె (Pune) నగరంలోని కొంధవా ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న 22 ఏళ్ల ఐటీ ఉద్యోగిరాలిపై బుధవారం రాత్రి 7.30 సమయంలో డెలివరీ ఏజెంటులా వచ్చిన యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి సోదరుడు బయటకు వెళ్లడంతో ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలసుకున్న నిందితుడు బ్యాంకు డాక్యుమెంటు లాంటిది చూపి సంతకం చేయాలని ఆమెను కోరాడు. బాధితురాలు పెన్ను కోసం ఇంట్లోకి వెళ్లగానే వెనుకగా వచ్చి తలుపు గడియ వేసి, ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన బాధితురాలిపై అత్యాచారం చేశార.
అనంతరం నిందితుడు బాధితురాలి ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆమె ఫొటోలు తీశానని, పోలీసులకు చెబితే వైరల్ చేస్తానని హెచ్చరిస్తూ 'నేను మళ్లీ వస్తా' అని ఓ సందేశం పెట్టి వెళ్లాడు. దాదాపు గంట తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు బంధువులకు ఫోను చేసి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం నేర స్థలాన్ని పరిశీలించిన పుణె కమిషనర్ అమితేశ్ కుమార్ నిందితుడి పట్టివేతకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.






