MP Gaurav Gogoi : కేంద్ర బడ్జెట్ లో పస లేదు : కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్

by Y. Venkata Narasimha Reddy |

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2025-26 బడ్జెట్(Union Budget)పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi)విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ లో ఏ మాత్రం పస లేదని, ప్రత్యేకతలు లేవని మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్ అంటూ విమర్శలు గుప్పించారు.

MP Gaurav Gogoi : కేంద్ర బడ్జెట్ లో పస లేదు : కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
X

దిశ, వెబ్ డెస్క్ : లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2025-26 బడ్జెట్(Union Budget)పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi)విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ లో ఏ మాత్రం పస లేదని, ప్రత్యేకతలు లేవని మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ టలో సామాన్యులకు మేలు చేసే అంశం ఏమి లేదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల ధ్యాస తప్ప ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి బడ్జెట్ లో కనపడలేదన్నారు. తాము ప్రధాన ప్రతిపక్షంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాటపై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశామని ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు. కుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సభ్యులు అందరం బడ్జెట్ ను బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. అయినప్పటికీ తొక్కిసలాట ఘటనపై చర్చకు మోడీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా అనే విషయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. లోక్ సభలో చర్చ ద్వారానే ఏ విషయంలోనైనా నిజా నిజాలు బయటికి వస్తాయని గౌరవ్ గొగోయ్ అభిప్రాయపడ్డారు.

కాగా కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను అధికార ఎన్డీఏ పక్షాలు సమర్థించుకుంటుండగా..ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోడీ సహా, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాలు బడ్జెట్ ను వికసిత భారత్ లక్ష్యానికి మార్గం వేసేదిగా అభివర్ణించారు. సంవత్సరానికి రూ.12లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా మార్చామని, దీంతో అల్పాదాయ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్(Jaimm Ramcsh) ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ను నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొనడంపై విమర్శలు గుప్పించారు. 'బడ్జెట్' రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని.. దీంతో ఇది కాస్త పట్టాలు తప్పిందని పేర్కొన్నారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనే నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారని.. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పని చేస్తాయన్నారని..కానీ, చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పిందన్నారు. త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి.. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రానికి బొనాంజా ప్రకటించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ(Trinamool Congress MP Abhishek Banerjee)స్పందిస్తూ బడ్జెట్ లో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదని..బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రం కోసం కేంద్రం బడ్జెట్ ను రూపొందించిందని..ప్రతి ఒక్కటీ బిహార్ కే దక్కాయని, బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు బెంగాల్ కు ఎలాంటి ప్రయోజనాలు దక్కవన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్(Senior Congress leader Shashi Tharoor) మాట్లాడుతూ బడ్జెట్ లో నిరుద్యోగం గురించి ప్రస్తావించలేదని..ఒకే దేశం ఒకే ఎన్నికను కోరుకునే పార్టీ ప్రతి ఏడాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తోందని ..ఎక్కువ సార్లు ఎన్నికలు జరిగితేనే ఆ పార్టీకి మిత్ర పక్షాల నుంచి ప్రశంసలు వస్తాయని భావిస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు.

Next Story