- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు బంద్ లేదు, అందరూ ఆఫీసుకు రావాల్సిందే! ప్రభుత్వం అల్టిమేటం
బుధవారం (ఆగస్టు 28) నాడు.. బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బంద్ సమ్మెలో పాల్గొనవద్దని, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం ప్రజలకు అల్టిమేటం జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: బుధవారం (ఆగస్టు 28) నాడు.. బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బంద్ సమ్మెలో పాల్గొనవద్దని, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం ప్రజలకు అల్టిమేటం జారీ చేసింది. బీజేపీ ఇచ్చిన పిలుపుతో సాధారణ జనజీవనం దెబ్బతింటుందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా "నబన్నా అభియాన్" నిరసన కారులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా.. రేపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పశ్చిమ బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే.. బీజేపీ ఇచ్చిన 12 గంటల బంద్ పై బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అయిన అలాపన్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. " బుధవారం బంద్ కు ప్రభుత్వం అనుమతి లేదు. అందువల్ల ఈ బంద్ లో పాల్గొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలను తప్పకుండా తీసుకుంటాం" అని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులందరికీ.. బంద్ లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే నోటిఫికేషన్ ను కూడా జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మరోవైపు మహిళా ట్రెయినీ డాక్టర్ కు న్యాయం చేయాలని కోరుతూ.. వెస్ట్ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫోరమ్ ఆగస్టు 28 బుధవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.






