- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ సంస్థ కుట్రకు పాల్పడే ఛాన్స్ ఉంది’.. ఫ్లైట్ క్రాష్ పై రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో జూన్ 12వ తేదీన చోటుచేసుకున్న విషాద ఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై యోగా గురు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యోగా గురువు రాందేవ్ బాబా భారత విమానయాన రంగంలో విదేశీ ప్రమేయంపై ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి విదేశీ కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రామ్‌దేవ్ బాబా తాజాగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం మెయింటెనెన్స్ తుర్కియేకి చెందిన ఓ కంపెనీ చూసుకుంటుందని నాకు తెలిసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఏవియేషన్ విభాగం పై దృష్టి సారించాలి. ఆ సంస్థ ఏదైనా కుట్రకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో విదేశీ కంపెనీలను జోక్యాన్ని బారతదేశం ఆపాలి’’ అని రాందేవ్ బాబా తెలిపారు.






