డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో విభేదాలు ఉన్నాయి: పళనిస్వామి

by Malleboina Mahesh |

అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో విభేదాలు ఉన్నాయి: పళనిస్వామి
X

దిశ, వెబ్ డెస్క్: అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి (Palaniswami) చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి (DMK-Congress alliance)లో కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తాయని, అధికార డీఎంకే, దాని కీలక మిత్రపక్షం కాంగ్రెస్ మధ్య పొత్తులో పగుళ్లు ఏర్పడ్డాయని అన్నారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మండిపడుతున్నారని, త్వరలోనే డీఎంకే శిబిరం (DMK camp) ఖాళీ అవుతుందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం జరిగిన భారీ ఎన్నికల ర్యాలీలో పళనిస్వామి మాట్లాడుతూ.. డీఎంకే, దాని ప్రధాన మిత్రపక్షం కాంగ్రెస్ (Congress) మధ్య పోరాటం చెలరేగిందని అన్నారు. ఇటీవల తిరునెల్వేలిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో, తమిళనాడుకు పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న పార్టీ నాయకుడు గిరీష్ చోడంకర్ "యాభై-యాభై డిమాండ్" ("Fifty-fifty demand")ను స్పష్టంగా వినిపించారని అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి ఆరోపించారు. కాగా ఆయన ఆరోపణలపై ఇప్పటికి కాంగ్రెస్, డీఎంకే నేతలు స్పందించకపోవడంతో డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో విబేదాలు నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story