ఆ జైలులో ఖైదీల కోసం నోరూరించే 173 రకాల వంటకాలు

by Batti.Sumithra |

జైలులో ఉన్న ఖైదీలకు చాలా వరకు అన్నం పప్పు వడ్డిస్తారని తెలుసు. కానీ ఓ రాష్ట్రంలోని ఖైదీలు మాత్రం యమా అదృష్టం చేసుకున్నారనే అనుకోవాలి.

ఆ జైలులో ఖైదీల కోసం నోరూరించే 173 రకాల వంటకాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : జైలులో ఉన్న ఖైదీలకు చాలా వరకు అన్నం పప్పు వడ్డిస్తారని తెలుసు. కానీ ఓ రాష్ట్రంలోని ఖైదీలు మాత్రం యమా అదృష్టం చేసుకున్నారనే అనుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారా జైలులో ఉండే ఖైదీల కోసం ఒకటి కాదు రెండు కాదు పానీ పూరీ, ఐస్‌క్రీం, మిఠాయిలతో సహా ఏకంగా 173 రకాల వంటకాలను సిద్దం చేస్తుంటారంట. అబ్బా వింటుంటేనే నోరూరుతుంది కదా. ఆహా ఆ జైలులో ఉండే ఖైదీలు ఎంత అదృష్టవంతులో అనుకుంటున్నారు కదా. మరి ఆ జైలు ఏ రాష్ట్రంలో ఉంది. అక్కడ ఖైదీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్ర జైళ్ల శాఖ ఓ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. జైలులో ఉండే ఖైదీల కోసం మహారాష్ట్రలోని క్యాంటీన్‌లో పానీ పూరీ, ఐస్‌క్రీం, మిఠాయిలు, షుగర్‌లెస్ స్వీట్లు, ఆర్గానిక్ ఫ్రూట్స్, వేరుశెనగలు, చాట్ మసాలా, పచ్చళ్ళు, కొబ్బరి నీళ్లు, చెస్ బోర్డులు, ఓట్ మీల్, కాఫీ, చిక్‌పీ ఫడ్జ్ వంటి 173 రకాల ఆహార పదార్థాలను జైలు మెనూలో పెట్టారు. అంతే కాదు ఖైదీలకు అవసరమైన వస్తువులతో సహా వినోద అంశాలను కూడా చేర్చింది. అలాగే ధూమపానం చేయాలనే ఖైదీల కోసం నికోటిన్- పీఆర్టీ మాత్రలు, ఫేస్ వాష్, హెయిర్ డైస్, టీ-షర్టులు, శరీర సంరక్షణ ఉత్పత్తులు, చదువుకునేందుకు ఆర్ట్ పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారట. ఇలా చేయడం ద్వారా ఖైదీలు డిప్రెషన్‌ నుంచి బయటపడతారని అక్కడి జైలర్ల ఉద్దేశం.

Next Story