- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆనాడు నెహ్రూ చేసిన గాయాలు ఈనాటికీ మానిపోలేదు : ప్రధాని మోదీ
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఆదివారం అస్సాంలో (Assam) పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రూ.18,530 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఆదివారం అస్సాంలో (Assam) పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రూ.18,530 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. 2.9 కిలోమీటర్ల పొడవైన నరేంగి - కురువా వంతెన, రూ.4,530 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 118.5 కిలోమీటర్ల పొడవైన గౌహతి రింగ్ రోడ్డుకు (Gauhathi Ring Road) శంకుస్థాపన చేశారు. అలాగే మంగళదాయి దరంగ్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎం స్కూల్ కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా దరంగ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. 1962 నాటి నెహ్రూ (Nehru) పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న ఆనాడు చైనాతో యుద్ధం తర్వాత ఈశాన్య ప్రాంత ప్రజలకు ఆయన చేసిన గాయాలు నేటికీ మానలేదన్నారు. ఆనాటి గాయాలపై ఇప్పటి కాంగ్రెస్ ఇంకా ఉప్పు చల్లుతూ వాటిని మండేలా చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందేందుకు దేశంపై విషం కక్కే వ్యక్తులతో జత కట్టిందని, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలోనూ ఇది బయటపడిందన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకల్ని ఇండియన్ ఆర్మీ మట్టుపెడితే.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) దాయాది సైన్యానికి మద్దతిస్తోందని దుయ్యబట్టారు. తాను శివభక్తుడిని అన్న మోదీ.. తనను ఎవరు ఎన్ని తిట్టినా విషంలాగా గొంతులోనే దాచుకుంటా అని, ఎవరికైనా అవమానం జరిగినా తట్టుకోలేనన్నారు.






